వాట్సాప్‌లో చాట్ లాక్ ఫీచర్.. వాట్సాప్ వినియోగదారులు పండుగ చేసుకునే వార్త ఇది. చాట్ లాక్ పేరుతో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేస్తోంది. దీనివల్ల వ్యక్తిగత చాట్‌లు ఎవరూ చూడకుండా లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసిన చాట్స్ అన్నీ ఒక ప్రత్యేక ఫోల్డర్‌లో వుంటాయి. ఆ ఫోల్డర్‌కు పాస్‌వర్డ్ రక్షణ వుంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ భద్రత కూడా వుంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత చాట్‌ను ఎవరూ చూడలేరు. వాట్సాప్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ప్రివ్యూ కూడా కనబడదు. నోటిఫికేషన్ వస్తే.. లాక్ అకౌంట్ అని మాత్రమే చూపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సులభంగా తెలుసుకోడానికి మెటా గ్రూప్ ఒక వీడియో విడుదల చేసింది. మీ ఫోన్ ఎవరి దగ్గరున్నా.. చాట్ మాత్రం భద్రంగా వుంటుందన్న కాన్సెప్ట్‌లో ఈ వీడియోను రూపొందించారు.
- చాట్ జీపిటి..
చాట్ జిపిటీ అనేది ఒక చాట్ బాట్. మనం ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషివలే జవాబులు ఇస్తుంది. (Generative Pre-training Transformer) అనేది ఒక రకమైన మెషీన్ లెర్నింగ్ మోడల్. ఈ చాట్‌బాట్స్ ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో అప్‌డేట్ చేయబడుతుంది. ఉదాహరణకు మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తున్న సమయంలో ఎర్రర్ రావడం వల్ల కోడింగ్ ఆగిపోయిందనుకోండి. ఆ కోడ్‌ను చాట్ జీపిటీకి ఇచ్చి ఎర్రర్‌ను గుర్తించమని అడిగితే.. అది గుర్తించి సరిచేస్తుంది. ఫేస్‌బుక్ ఒక మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోడానికి 10 నెలలు, ట్విట్టర్‌కు 24 నెలలు పడితే... ఈ చాట్‌బాట్ విడుదలైన ఐదురోజుల్లోనే ఒక మిలియన్ యూజర్లను నమోదు చేసుకుంది.
- గూగుల్ బార్డ్..
ప్రముఖ సెర్చ్‌ఇంజన్ గూగుల్ యొక్క బార్డ్ ఎఐ చాట్‌బాట్ ఇప్పుడు 180 దేశాలలో అందుబాటులో వుంది. ఓపెన్ ఎఐ యొక్క చాట్‌జీపిటీకి పోటీగా గూగుల్ రూపొందించిన చాట్‌బాట్ ఇది. ఈ బార్డ్‌ను సమగ్రమైన సమాచారం కోసం ప్రశ్నలకు సమాధానమివ్వడం, టెక్ట్స్ కంటెంట్ యొక్క విభిన్నమైన, సృజనాత్మకమైన ఫార్మాట్‌లను రూపొందించడం, భాషలను అనువదించడం, కోడ్ ఉత్పత్తి, డీబగ్గింగ్, కోడ్ స్నిప్పెట్‌లను వివరించడం వంటి అనేక పనులలో దీనిని ఉపయోగించవచ్చు. ఈ పనులన్నీ చాట్ జీపిటీలోనూ సాధ్యమే. అయితే చాట్‌జీపిటిలో లేని కొన్ని అంశాలు బార్డ్‌లో వున్నాయి. దీనిలో ప్రశ్న అడుగుతున్న సమయంలోనే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేస్తుంది. టైప్ చేయడానికి వీలుకాని సమయంలో వాయిస్ ఇన్‌పుట్‌ను కూడా ఉపయోగించవచ్చు. బార్డ్‌లోని మరో ముఖ్యమైన అంశం... పిడిఎఫ్, వర్డ్, హెచ్‌టిఎంఎల్ వంటి ఫార్మాట్‌లలో వాక్యాలను రూపొందించగలదు. ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా సులభంగా వుంటుంది. ఇలాంటివి గూగుల్ బార్డ్‌లో చాలానే వున్నాయి.