Nov 05,2023 22:54

మాట్లాడుతునన సిఎస్‌ఎన్‌ రెడ్డి


ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్కూల్‌ గేమ్స్‌ అండర్‌ -19 అంతర్‌ జిల్లాల రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను నగరంలోని పిబి సిద్ధార్థ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఆషీసర్‌ సి.ఎస్‌.ఎన్‌.రెడ్డి తెలిపారు. మొగల్‌రాజపురంలోని పిబి సిద్ధార్థ జూనియర్‌ కళాశాల కాన్ఫరెన్స్‌హాల్‌లో టోర్నమెంట్‌ వివరాలను తెలియచేసేందుకు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలు 8,9 తేదీలలో పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్‌ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలకు గానూ 13 జిల్లాల నుండి 130 మంది బాల, బాలికల విభాగంలో క్రీడాకారులు పాల్గొంటారన్నారు. బాలుర విభాగంలో ఒక్కొక్క జిల్లా నుండి ఐదుగురు క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 26 మంది నిర్వహణా సభ్యులు పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్‌ చీఫ్‌ కోచ్‌ భాస్కరరావు నిర్వహణలో పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనపరచిన వారిని స్కూల్‌ గేమ్స్‌ జాతీయ జట్టుకు ఎంపికచేస్తామన్నారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబరు 12వ తేదీ నుండి నగరంలోనే జరుగనున్నాయని తెలిపారు. పిబి సిద్ధార్థ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చుండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్కూల్‌ గేమ్స్‌ నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపారు. టోర్నమెంట్‌ డైరెర్టక్‌ వేమూరి రవికాంత మాట్లా డుతూ పోటీలను నిర్వహించే చెన్నుపాటి ఇండోర్‌ స్టేడియంలో ఆరు కోర్టుల ద్వారా పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.